Thursday, October 23, 2008

ఆనందం ....


ఆ ఉదయ భానుడు .... నిద్రకళ్ళు నులుపుకుంటూ ... నన్ను చేరే వేళ.....
మంచు దుప్పటి కప్పుకున్న నేల బద్దకంగా కనులు తెరిచే వేళ ....
చీకటి దుప్పటి కప్పుకున్న ఆకసం .... కొత్త సిందూరం తో మెరిసేవేల ....
నా చెలి గుండెల మద్య వెచ్చగా ముఖం దాచుకుని ..... చెలి ఆలింగనం తో ఆదమరిచి నిదురించేవేల
ఎంత... ఆనందమో కదా..
చెలి తడి ఆరని ముద్దుతో నుదిటిని స్ప్రుసిస్థూ... లే బంగారూ అని గోముగా నిదరాలేపే వేల...
మత్తుగా తనపై వాలిపోతుంటే ..... స్నానం చేయండి శ్రీవారూ అంటూ బలవంతంగా నన్ను తోసే వేల...
స్నానం చేసి వస్తూ ..... తనని అల్లుకుని అల్లరి చేస్తుంటే.... నిన్నూ ........ అంటూ .... చిరుకోపం తో చుసేవేల ....
మహానుభావా...నన్ను ఒదిలితే కొంచం దోసలేసి పెడతాను అంటూ నన్ను బ్రతిమలాడే వేల...
ఎంత ...ఆనందమో కదా...
సాయంత్రం అలసి వచ్చిన నాకు చిరునవ్వు తో ఎదురు వచ్చేవేళ ....
నా కవుగిలిలో ఒదిగిపోతూ .. నన్ను అల్లుకునే వేల..
రాత్రి గోరుముద్దలు ముద్దులతో కోసరికోసారి వోడ్డించే వేల..
మల్లెల పంపుపి తన అందాన్ని కోసరికోసారి ... రుచి చుపించేవేల ..
అలసిపోయి తనపి వాలి ఆదమరిచి నిదురోయేవేల ...
ఎంత ఆనందమో కదా ............
కాదంటావా ????