Wednesday, August 20, 2008

మేఘాలు చాటున దాగిన జాబిలి


సహజ వైరి , ఇవే కలసి ఉండగా లేనిది మన మధ్య ఎందుకీ కొట్లాట.... నిజమా కాదా ? నీతో గొడవ పడితే మనసు నిలవదోయి , నిజమే చెపుతున్నా నీతో గొడవ పడిన క్షణం ఎర్ర గులాబీ లో అందం బదులుగా ముల్లు కనిపిస్తాయి , నువ్వు పక్కన ఉంటే ఎండిన ఆకు కుడా అందంగా కనిపిస్తుంది , వర్షపు జల్లులు చక్కిలిగిలి పెడతాయి , చనందమామ నవ్వుతుంది, పక్షులు పలకరిస్తాయి , మల్లెలు ముద్దాడతాయి , మరి నువ్వు పక్కన లేకుంటే... ఇంత అందమైన ప్రకృతీ శున్యంగా కనిపిస్తుంది , ఇంతకీనువ్వెవరో నే చెప్పలేదు కదూ !!! అది అందరికీ వెన్నెల నిచ్చే నిండు జాబిలి.

జాబిలీ ....

ఓ నా జాబిలీ ,
నీకై ఎంతగా ఎదురు చూసానో అది నీకేలా చెప్పను అందుకే ఈ ప్రకృతి సాయం తీసుకున్నా !!
నిండు పున్నమిని అడుగు... ఎన్ని నాళ్ళు నిదుర లేని రాత్రులు గడిపి నీ తలపులలో విహరిస్తూ తనని ఎంత మొరపెట్టు కున్నానో నీకు చెపుతుంది.
వీచే పిల్లగాలిని అడుగు .... నీ చేతి స్పర్శకై నేనెంతగా ఎదురుచుసానో చెపుతుంది
విరబూసిన విరజాజులను అడుగు ... నేనెంతగా కుమిలిపోయనో చెపుతాయి .
నీకు తెలుసా నా బాధ చూడలేక ఆకాశం వర్షించేది . ఐనా నా చెక్కిళ్ళను వెచ్చదనం తదిపేసేది . బహుసా... కన్నీరేమో .
ఇంతగా ఎదురుచూసిన నువ్వు దగ్గరైనా క్షణం ఆ మధురానుభూతి నా మాటలకు అందదు... ఐ లవ్ యు నా చెలీ