Thursday, October 23, 2008

ఆనందం ....


ఆ ఉదయ భానుడు .... నిద్రకళ్ళు నులుపుకుంటూ ... నన్ను చేరే వేళ.....
మంచు దుప్పటి కప్పుకున్న నేల బద్దకంగా కనులు తెరిచే వేళ ....
చీకటి దుప్పటి కప్పుకున్న ఆకసం .... కొత్త సిందూరం తో మెరిసేవేల ....
నా చెలి గుండెల మద్య వెచ్చగా ముఖం దాచుకుని ..... చెలి ఆలింగనం తో ఆదమరిచి నిదురించేవేల
ఎంత... ఆనందమో కదా..
చెలి తడి ఆరని ముద్దుతో నుదిటిని స్ప్రుసిస్థూ... లే బంగారూ అని గోముగా నిదరాలేపే వేల...
మత్తుగా తనపై వాలిపోతుంటే ..... స్నానం చేయండి శ్రీవారూ అంటూ బలవంతంగా నన్ను తోసే వేల...
స్నానం చేసి వస్తూ ..... తనని అల్లుకుని అల్లరి చేస్తుంటే.... నిన్నూ ........ అంటూ .... చిరుకోపం తో చుసేవేల ....
మహానుభావా...నన్ను ఒదిలితే కొంచం దోసలేసి పెడతాను అంటూ నన్ను బ్రతిమలాడే వేల...
ఎంత ...ఆనందమో కదా...
సాయంత్రం అలసి వచ్చిన నాకు చిరునవ్వు తో ఎదురు వచ్చేవేళ ....
నా కవుగిలిలో ఒదిగిపోతూ .. నన్ను అల్లుకునే వేల..
రాత్రి గోరుముద్దలు ముద్దులతో కోసరికోసారి వోడ్డించే వేల..
మల్లెల పంపుపి తన అందాన్ని కోసరికోసారి ... రుచి చుపించేవేల ..
అలసిపోయి తనపి వాలి ఆదమరిచి నిదురోయేవేల ...
ఎంత ఆనందమో కదా ............
కాదంటావా ????

Tuesday, September 23, 2008

సరదా సాయంత్రం ....


ఓ అరుదైన సాయంత్రం ....
ఆ భానుడు రోజంతా వెలుగునిచ్చి చల్లగా పడమటి కొండలలోకి జారుకునే వేల
గువ్వల జంటలు రోజంతా తిరిగి అలసి గూటికి చేరే వేల ...
గొధూలిని రేపుతూ ఆలమందలు ఇల్లుచేరే వేల.....
చెలి రోజంతా కష్టపడి చెలికాని కోసం ఎదురుచూసే వేల.....
చెలి ఎదురు చూపులను అర్ధం చేసుకున్న చెలికాడు .. ఎదురు చూసిన చెలి కనులను ముద్దాడే వేల...
ఆ ముద్దు కు పులకరించి చెలి తమకంతో .... చెలికాని ని అల్లుకునే వేల...
చెలి మనసును అర్ధం చేసుకుని చెలికాడు చెలిని అల్లుకుపోయి .. తమకంతో తన అధరాలను అందుకుంటూ తనను ఆక్రమించుకునే వేల..
చెలి అందాలఫై ముద్దు ముద్రలు వెస్తూ .. అందాలను దాచే అడ్డంకులను చెరిపేస్తూ తనతో కలపడే వేల...
చెలికాని ని తనలో కలిపెసుకోవాలనే ఆరాటంతో ... ఆర్తిగా చేలికనిని పెనవేసుకునీ వేల..
ఏక అది స్వర్గపు దారే...
అలసి వేదోపోయే ఆట
ఓడి గెలిచే ఆట
మనసుల్ని కలిపీ ఆట
నువ్వే లేకుంటే స్వర్గమే లేదని చెప్పే ఆట...
ఇవన్నీ అందించిన సాయంత్రం
నిజంగా ఎంత మధురమైన సాయంత్రమూ కదా ...
కాదంటావా...???

Monday, September 8, 2008

నా జాబిలి పుట్టినరోజు


నా జాబిలి పుట్టినరోజు...
నా హృదయం ఆర్తిగా సుభాకాక్షలు చెప్పాలని ఎదురు చుసిన రోజు ...
ప్రకృతి పులకరించి తన ఆనందాన్ని కురిపించి నిన్ను నిలువెల్లా తడిపిన రోజు
మరి నీకేమి కానుకను ఇవ్వను...???
రోజంతా తిరిగి ఊరంతా గాలించా నా జాబిలికి మనసుకు కానుకనిద్దాం అని ....
కానీ ...
నేను ఓడిపోయాను ...
అందుకే ...
ఆ ఉదయభానుడ్ని అడిగా నా ప్రేమ వెచ్చదనాన్ని నీకు తెలుపమని ......
సెలయేటి గల గల ని బ్రతిమిలాడు కున్నా ... నీ అందెలకు సవ్వడిని ఇవ్వమని..
నెలరాజును అర్ధించా ... నా నేస్తాన్ని చల్లగా స్ప్రుసించమని
గులాబీ లను మొరపెట్టుకున్నా ... నా గుండె గుబులును నీతో తెలుపమని..
నేస్తమా నీవు నా ప్రాణం ...
దయచేసి నా ప్రేమ ఆద్రతను ఆస్వాదించు ......
ప్రేమలో లోపాల్ని వెతికి నా మనసు గాయపరచకు...
ప్రేమతో ...
నీ...

Thursday, September 4, 2008

నవ్వవే జాబిలీ...

నా జాబిలీ ....
నాతో ఎందుకు నీకీ కొట్లాట ?? ఎందుకీ అలక ??
నీ వే అలిగితే కలువలు కన్నీరు కార్చవా !!
ఆ నీలి సద్రం గొంతెత్తి గోషించదా...
మల్లెలు ముడుచుకు పోవా ...
సన్నజాజులు సద్దుమనగావా ...
చీకటి దుప్పటి కప్పుకొని వెత్చగా నిదరోతున్న రాత్రి ఒక్కసారిగా ఉలికిపదడా ...
రోజంతా విహరించి సేద తీరే గువ్వల జంట .... ఒక్కసారి భయపడదా
నవ్వే వెన్నెల నాకే కాదు లోకానికే అవసరం ...
అందుకే బతిమాలు కుంటున్నా ....
ఒక సారి నవ్వమని ....
నవ్వవూ...

Wednesday, August 20, 2008

మేఘాలు చాటున దాగిన జాబిలి


సహజ వైరి , ఇవే కలసి ఉండగా లేనిది మన మధ్య ఎందుకీ కొట్లాట.... నిజమా కాదా ? నీతో గొడవ పడితే మనసు నిలవదోయి , నిజమే చెపుతున్నా నీతో గొడవ పడిన క్షణం ఎర్ర గులాబీ లో అందం బదులుగా ముల్లు కనిపిస్తాయి , నువ్వు పక్కన ఉంటే ఎండిన ఆకు కుడా అందంగా కనిపిస్తుంది , వర్షపు జల్లులు చక్కిలిగిలి పెడతాయి , చనందమామ నవ్వుతుంది, పక్షులు పలకరిస్తాయి , మల్లెలు ముద్దాడతాయి , మరి నువ్వు పక్కన లేకుంటే... ఇంత అందమైన ప్రకృతీ శున్యంగా కనిపిస్తుంది , ఇంతకీనువ్వెవరో నే చెప్పలేదు కదూ !!! అది అందరికీ వెన్నెల నిచ్చే నిండు జాబిలి.

జాబిలీ ....

ఓ నా జాబిలీ ,
నీకై ఎంతగా ఎదురు చూసానో అది నీకేలా చెప్పను అందుకే ఈ ప్రకృతి సాయం తీసుకున్నా !!
నిండు పున్నమిని అడుగు... ఎన్ని నాళ్ళు నిదుర లేని రాత్రులు గడిపి నీ తలపులలో విహరిస్తూ తనని ఎంత మొరపెట్టు కున్నానో నీకు చెపుతుంది.
వీచే పిల్లగాలిని అడుగు .... నీ చేతి స్పర్శకై నేనెంతగా ఎదురుచుసానో చెపుతుంది
విరబూసిన విరజాజులను అడుగు ... నేనెంతగా కుమిలిపోయనో చెపుతాయి .
నీకు తెలుసా నా బాధ చూడలేక ఆకాశం వర్షించేది . ఐనా నా చెక్కిళ్ళను వెచ్చదనం తదిపేసేది . బహుసా... కన్నీరేమో .
ఇంతగా ఎదురుచూసిన నువ్వు దగ్గరైనా క్షణం ఆ మధురానుభూతి నా మాటలకు అందదు... ఐ లవ్ యు నా చెలీ